కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లను పరిశీలన చేసిన .....కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్.



కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు .

ఏర్పాట్ల ను పరిశీలన చేసిన ... 

కర్నూలు జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్.
V3 టివి తెలుగు న్యూస్ కర్నూలు:

కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షల కోసం సిద్ధం చేస్తున్న  ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్  పరిశీలించారు. 
ఈ సంధర్బంగా గురువారం  శారీరక ధారుఢ్య పరీక్షలు నిర్వహించే కర్నూలు ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ మైదానం ను  జిల్లా ఎస్పీ  పరిశీలించారు.
మైదానంలో చేపట్టాల్సిన పనుల పై పోలీసు అధికారులకు  దిశానిర్దేశం చేశారు.
ఎలక్ట్రిసిటి, ఇంటర్నెట్ , వైద్యం వంటి  వసతుల ఏర్పాట్లను సిధ్దం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. 
1600 మీటర్స్, లాంగ్ జంప్ ,100 మీటర్స్ పరుగు పందెం ప్రదేశాలను పరిశీలించారు. 
అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన  అభ్యర్ధులకు 2024  డిసెంబర్ 30 వ తేది నుండి 2025 ఫిబ్రవరి 01 వ తేది వరకు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్దులకు  (PMT / PET) శారీరక దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలు జరగనున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, ఎపిఎస్పీ అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు, డిఎస్పీలు బాబు ప్రసాద్, షర్ఫుద్దీన్, మహబూబ్ భాషా, రమణ, సిఐలు, ఆర్ ఐలు ఉన్నారు.