పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి:- సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య....

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి:- 
సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య..
..
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-కూటమి ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్‌ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ చార్జీలు పెంపుదలను ఖండిస్తూ సోమవారం హాలహర్వి స్థానిక సిపిఐ భవనం నుంచి ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయంలో తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణ చట్టాలను అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు వ్యతిరేకించారని, నేడు అధికారానికి వచ్చిన ఆరు మాసల్లోనే అదే విద్యుత్తు చట్టాన్ని అమలు చేయడం దుర్మార్గమని, ఈ చర్య రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేకూర్చడమేనని విమర్శించారు. గత ప్రభుత్వం కంటే టిడిపి, జనసేన, బిజెపి కూటమి విద్యుత్‌ భారాలను శర వేగంగా రాష్ట్ర ప్రజలపై మోపుతున్నాయని, ఇది కేవలం కార్పొరేట్‌ విధానాలను పెంచి పోషించడమేనని తెలిపారు. అదానీ అక్రమాలను ప్రపంచానికి వెలుగు చాటినప్పటి నుంచి మన రాష్ట్రంలో బాబు, జగన్‌, పవన్‌ కవచంలా నిలిచారని, ఇది రాష్ట్ర ప్రజలకు నమ్మకద్రోహాన్ని తలపెట్టినట్లేనని విమర్శించారు. కావున వెంటనే రూ.17 వేల కోట్ల ట్రూ అప్‌ చార్జీల భారాన్ని రద్దు చేయాలని, ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, పెంచిన ట్రూ ఆఫ్‌ విధానాన్ని పూర్తిగా ఉపసం హరించుకోవాలని, టిడిపి కూటమి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని, కేంద్రం విద్యుత్‌ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని, పెట్టిన మీటర్లు తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ, వృత్తి దారులందరికీ 200 నుంచి 350 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని, ఆర్థిక నేరానికి పాల్పడిన అదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాముడు, వన్నూర్ వలి, లింగప్ప. నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గున్నారు.