చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసు డ్రోన్ కెమెరాతో నిఘా.
• 18 ఒపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు.
• జిల్లాలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్.
V3 టీవీ తెలుగు న్యూస్ కర్నూలు:-
జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలో నేర నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ సంధర్బంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని చెన్నమ్మ సర్కిల్, బళ్ళారి చౌరస్తా, డిమార్ట్ వెనుక వైపు ఉన్న సమస్యాత్మక ప్రదేశాలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల పై డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఉంచారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 18 మందిని కర్నూలు ట్రాఫిక్ పోలీసులు, కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు కలిసి అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.
( మొత్తం 18 మందిలో ... చెన్నమ్మ సర్కిల్ వద్ద 7 మందిని, కల్లూరు వక్కిలేరు వాగు దగ్గర 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.)
చట్టవ్యతిరేక కార్యకలాపాల పై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి పై నిరంతరం పర్యవేక్షణ నిఘా కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్, కర్నూలు నాల్గవ పట్టణ ఎస్సై గోపినాథ్, ట్రాఫిక్ ఆర్ ఎస్సై హుస్సేన్ పాల్గొన్నారు.