డియోబ్రా రెడెన్ అనే వ్యక్తి ఓ కేసులో అరెస్టయ్యాడు. ఆ కేసులో వాదనలు వింటున్న జడ్జి మేరీ కే హోల్థస్‌పై నిందితుడు దాడి చేశాడు. తాజాగా ఆ దాడికి సంబంధించిన కేసును న్యాయస్థానం విచారించింది. నిందితుడు డియోబ్రా సైతం నేరాన్ని అంగీకరించాడు. దాడికి ముందు అతనిపై ఉన్న కేసుల కారణంగా డియోబ్రా మానసిక అనారోగ్యానికి గురయ్యాడని, వాదనల సమయంలో అందుకు సంబంధించిన మందులు వేసుకోలేదని అతడి తరఫున న్యాయవాదులు వాదించారు. కాగా, దాడి సమయంలో తాను ఎంతో భయభ్రాంతులకు గురయ్యానని జడ్జి హోల్థస్ తెలిపారు. అంతేకాకుండా ఆ సమయంలో మహిళా న్యాయమూర్తితో సహా కోర్టు సిబ్బందికి గాయాలైనట్లు ప్రతివాదులు పేర్కొన్నారు. ఈక్రమంలోనే నిందితుడు గరిష్ఠంగా 65 ఏళ్లు జైలులోనే గడపాలని న్యాయస్థానం ఆదేశించింది. ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో డియోబ్రా రెడెన్ అరెస్టు అయ్యాడు. ఈ కేసుకు సంబంధించి కౌంటీ డిస్ట్రిక్ట్‌లో జడ్జి మేరీ కే హోల్థస్ వాదనలు వింటున్నారు. ఈక్రమంలోనే డియోబ్రా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన కోర్టు సిబ్బంది ఆ దాడిని అడ్డుకున్నారు. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అమెరికా లో లాస్ వెగాస్ కోర్టులో ఓ కేసులో వాదనలు వింటున్న మహిళా జడ్జిపై నిందితుడు దాడికి పాల్పడ్డాడు.
December 11, 2024
అమెరికా లో లాస్ వెగాస్ కోర్టులో ఓ కేసులో వాదనలు వింటున్న మహిళా జడ్జిపై నిందితుడు దాడికి పాల్పడ్డాడు. జనవరిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. తాజాగా ఆ నిందితుడికి కఠిన శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది.