మహిళల, బాలబాలికల భద్రత, రక్షణకు సమన్వయంతో పని చేయాలి... జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ .
• లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలనే కరపత్రాలను ఆవిష్కరణ చేసిన... జిల్లా ఎస్పీ.
• బాల్య వివాహాలు, బాలల బిక్షాటనను పూర్తిగా నిర్ములించాలి.
• గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి బాలికలకు అవగాహన కల్పించాలి.
• బాల్య దశను ఉన్నతంగా తీర్చిదిద్దాలి.
• మహిళలు, చిన్న పిల్లల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టాలి.
V3 టివి తెలుగు న్యూస్ కర్నూలు:
మహిళల భద్రత, రక్షణకు మరియు బాల్య దశ ను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అన్నారు.
ఈ సంధర్బంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలులోని చైల్డ్ వేల్పేర్ కమిటి, డిస్ట్రిక్ చైల్ట్ ప్రోటెక్షన్ యూనిట్, ఐసిడిఎస్, విద్యా శాఖ, లేబర్ డిపార్ట్మెంట్, అంగన్ వాడీ టీచర్స్, అంగన్ వాడీ వర్కర్క్, కస్తూర్భగాంధీ విద్యాలయ శాఖల సిబ్బందితో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు.
పలు సూచనలు, సలహాలు చేశారు.
అనంతరం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలనే కరపత్రాలను జిల్లా ఎస్పీ ఆవిష్కరణ చేశారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మాట్లాడుతూ...
ఇటీవల ఒక చైల్డ్ లేబర్ ను రెస్క్యూ చేసిన ఐసిడిఎస్ మరియు ఇతర శాఖల వారిని అభినందిస్తున్నామన్నారు.
చిన్నపిల్లలు బిక్షాటన చేయడం ఎక్కడ కూడా కనపడకూడదన్నారు.
మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కొందరూ తెలిసి తెలియక యుక్తవయస్సులో ఉన్న యువతి, యువకులు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళి పోతున్నారన్నారు. తల్లిదండ్రులు అటువంటి పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలన్నారు.
మిస్సింగ్ , పోక్సో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. అటువంటివి చేయకూడదని బాల, బాలికలకు కౌన్సిలింగ్ చేయాలన్నారు. అటువంటి విషయాల గురించి సమాచారం అందించాలన్నారు.
సమాజాన్ని కాపాడాలన్నారు. చదువుకున్న వారు కూడా కొందరు కుటుంబ కారణాలతో తల్లి, తండ్రులు , క్షణికావేశాలతో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడి పిల్లలను ఆనాథలు చేస్తున్నారన్నారు.
పిల్లల గురించి ఆలోచించాలన్నారు.
పాఠశాలలో బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి తెలియజేయాలన్నారు.
లైంగిక నేరాల బారిన పడకుండా వారిని రక్షించాలన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పిల్లల పై అఘాయిత్యాలు, బాల్యవివాహాలు, వరకట్నవేధింపులు, లైంగిక వేధింపులను నివారించడానికి పట్టణాలు, మండలాలు, గ్రామాలలో అవగాహాన సదస్సులు చేపట్టాలన్నారు.
స్వచ్చంధ సంస్ధలు, ప్రభుత్వశాఖలు, గ్రామస్ధాయి అధికారులు కూడా సహాకరించాలన్నారు.
మహిళలపై జరుగుతున్న నేరాల నివారణే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.
బాలబాలికల రక్షణ, సహాయం కొరకు చైల్డ్ లైన్ 1098 కు గాని, హైల్ప్ లైన్ 181 కు గాని, పోలీసు డయల్ 100 గాని సమాచారం అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్ వేల్పేర్ కమిటి చైర్ పర్సన్ ఎస్. జుబేధ బేగం, DEO శ్యామూల్ పాల్, బాలల సంరక్షణ అధికారి శారద, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్ మెంట్ అధికారి నీలకంఠేశ్వర్, సిఐలు ప్రసాద్, శివశంకర్, శ్రీమతి విజయలక్ష్మీ , ఎన్జీఓ లు, ఉన్నారు.