సీజనల్ హాస్టల్స్ ప్రారంభం
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-సీజనల్ హాస్టల్స్ విద్యార్థినీ విద్యార్థులు
వలస విద్యార్థిని విద్యార్థుల మీ కలలు సహకారం చేసుకోవాలని , మండల విద్యాధికారి ఈరన్న, ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్ నాగరాజు లు అన్నారు మంగళవారం మండల హాల హరివి మండల పరిధిలోని ని ట్ర వట్టి గ్రామంలో సీజనల్ హాస్టల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు మండలంలో సీజనల్ హాస్టల్స్ ద్వారా 50మంది విద్యార్థిని విద్యార్థులను వలసలు వెళ్లకుండా నాణ్యమైన భోజనంతో పాటు విద్యను అందించడం జరుగుతుందన్నారు ప్రభుత్వం ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థులు విద్యకు దూరం చేయకూడదని దృఢమైన సంకల్పంతో సీజనల్ హాస్టల్స్ ను ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు సదరు హాస్టల్స్ వలస విద్యార్థులకు ఆశకిరణాలుగా మిగిలిపోతాయని వారు కొనియాడారు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు వలస వెళ్ళు తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారి పిల్లలను సీజనల్ హాస్టల్ లో చేర్పించి చదువుకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు సదరు సెంటర్లలో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారిచే విద్య బోధన అందించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని వలస విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్ నాగరాజు, జెడ్పి ప్రధానోపాధ్యాయులు షేక్ అబ్దుల్ అకీమ్ ఉపాధ్యాయులు నాగ స్వామి, సురేష్ కుమార్ రెడ్డి, జ్యోతి సీఆర్పీలు ముక్కన్న ఉపాధ్యాయులు కేర్ టేకర్లు పాల్గొన్నారు