...పంచలింగాల గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని వందకు వంద శాతం నెరవేరుస్తామని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అందజేశారు.. ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు..ప్రభుత్వం ఏర్పడి 6 నెలలలోపే 75 శాతం హామీలు నెరవేర్చామన్న ఆయన..ఉగాది పండుగ నుంచి ఆర్టీసీ బుస్సులలో మహిళల ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.