తోపులాటలో గాయపడ్డ ఎం.పి ప్రతాప్ సారంగికి ప్రథమ చికిత్స అందించిన కర్నూలు, నంద్యాల ఎం.పీలు

 ...తోపులాటలో గాయపడ్డ ఎం.పి ప్రతాప్ సారంగికి ప్రథమ చికిత్స అందించిన కర్నూలు, నంద్యాల ఎం.పీలు

పార్లమెంట్ ఆవరణంలో బి.జె.పి ,కాంగ్రెస్ ఎం.పిల మధ్య జరిగిన తోపులాటలో గాయపడ్డ బిజెపి ఎం.పి ప్రతాప్ సారంగి కి కర్నూలు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి లు ప్రథమ చికిత్స అందించారు... తోపులాటలో కింద పడ్డ ప్రతాప్ సారంగిని అక్కడే ఉన్న నాగరాజు, శబరిలు హుటాహుటిన పైకి లేపి తలకు తగిలిన గాయానికి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు...

:రాహుల్ గాంధీ పై మండి పడ్డ ఎం.పి బస్తిపాటి నాగరాజు

పార్లమెంట అవరణంలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు పై కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మండిపడ్డారు... బాధ్యత గల ఎం.పి పదవిలో ఉన్న రాహుల్ గాంధీ తోటి ఎం.పీల పై దాడి చేయడం  అమానుషమైన ఘటన అని ఒక ప్రకటనలో తెలిపారు.. గొప్ప రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన ఆయన వీధి రౌడీలా ప్రవర్తించడం  విచారకరమన్నారు.. రాహుల్ గాంధీ దాడిలో బిజెపి ఎం.పి ప్రతాప్ సారంగి తీవ్రంగా గాయపడగా, మరో ఎం.పి కూడా గాయపడ్డారన్నారు.. రాహుల్ గాంధీ పై స్పీకర్ తో పాటు, పోలీస్ స్టేషన్లో కూడా ఎన్డీయే ఎం.పీలం ఫిర్యాదు చేశామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాహుల్ గాంధీ పై స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని ఎం.పి నాగరాజు కోరారు..