అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కే టి ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబర్ 22 వ తేదీని గణిత శాస్త్రవేత్త శ్రీరామానుజం125వ జన్మదినాన్ని పురస్కరించుకుని 21వ తారీకు శనివారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ రఘురామమూర్తి గారి ఆధ్వర్యంలో గణిత శాస్త్ర దినోత్సవాన్ని జరిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే రాయదుర్గం నియోజకవర్గం హాజరయ్యారు. అదేవిధంగా అదనపు ముఖ్య అతిథిగా పత్తికొండ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మునగాల రామకృష్ణ హాజరు కావడం జరిగింది. గతంలో రాయదుర్గంలోని కే టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 2021 నుంచి జూలై 2024 వరకు వృక్షశాస్త్ర అధ్యాపకునిగా మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గా తన విధులను సక్రమంగా నిర్వర్తించుతూ సేవలను కొనసాగించారు.