ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పండుగ పంపిణిలో పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బీసీల ముద్దుబిడ్డ ఎన్.రాఘవేంద్ర రెడ్డి మంగళ వారం కోసిగి మండలం పల్లెపాడు గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి లో పాల్గొన్నారు. పెన్షన్ దారులకు పంపిణీ చేసి ఇంచార్జ్ గారు మాట్లాడుతూ జనవరి నెలలో ఇచ్చే పెన్షన్ ని కూడా ఒకరోజు ముందు పెన్షన్ పంపిణీ చేసి మరియు పంచాయతీరాజ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడాఈ రోజునే జీతాలు వేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం,ఏకైక సీఎం మా నారా చంద్రబాబు నాయుడు అని సంతోషభావం వ్యక్తం చేశారు. పెన్షన్ దారులకు ఇది ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఒక రోజు ముందే జీతాలు తీస్కొని కూటమి ప్రభుత్వం ఆనందభావం వ్యక్తం చేస్తున్నారు అంటూ మాట్లాడటం జరిగింది..ఈ కార్యక్రమంలో కోసిగి మండల ఎంపీడీఓ గారు,మండల నాయకులు ముత్తురెడ్డి , పల్లెపాడు రామిరెడ్డి , జ్ఞానేష్ ,సాంబయ్య ,వక్రని వెంకటేష్ ,అరివిలి వీరేష్ , పల్లెపాడు సర్పంచ్ రాజేంద్ర నాయుడు , ఉప్పలపాటి అర్జున్ మరియు సచివాలయం ఉద్యోగులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.