సోలార్ సిస్టం డిజిటల్ బారికేడ్స్ ను ప్రారంభించిన .... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ .
• కర్నూలు లో ట్రాఫిక్ నియంత్రణ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం ... జిల్లా ఎస్పీ.
V 3 టివి తెలుగు న్యూస్ కర్నూల్:
కర్నూలు లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ తెలిపారు.
ఈ సంధర్బంగా గురువారం కర్నూలు కొత్తపేట దగ్గర ఉన్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఆవరణంలో కర్నూలు పట్టణ వ్యాపార సంస్ధల సహాకారంతో 5 సోలార్ సిస్టం డిజిటల్ బ్యారికేడ్లను, 10 ఐరన్ బ్యారి కేడ్లను , 50 నో పార్కింగ్ బోర్డులను, 2 ఆంప్లి ఫైర్ లను కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ప్రారంభించారు.
ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి .బిందు మాధవ్ మాట్లాడుతూ...
కర్నూలు పట్టణ వ్యాపార సంస్ధల సహాకారంతో , పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు 5 సోలార్ సిస్టం డిజిటల్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే సూచనలను ఈ సోలార్ బ్యారికేడ్లు డిజిటల్ బోర్డుల ద్వారా తెలియజేస్తాయన్నారు.
కర్నూలు ప్రజలను ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల చైతన్య పరచాలనే ఉద్దేశ్యంతోనే పలు రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అధే విదంగా ట్రాఫిక్ నియంత్రణ సూచనలు తెలిపే మైక్ ఆనౌన్స్ మెంట్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు.
రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు , ఓపెన్ డ్రింకింగ్ జరిగే ప్రాంతాలలో అసాంఘిక కార్యకలపాలను నివారించేందుకు డ్రోన్ కెమెరా లను కూడా వినియోగిస్తున్నామన్నారు.
5 సోలార్ సిస్టం డిజిటల్ బ్యారికేడ్లు, 10 ఐరన్ బారికేడ్లు, 50 నో పార్కింగ్ బారికేడ్లు , 2 ఆంప్లి ఫైర్స్ లకు సహాకారం అందించిన చందన బ్రదర్స్, రామ్ రాజ్, విజయ మిల్క్ డైరీ, డ్రస్ సర్కిల్, మహ సిమెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు.
రాబోయే రోజులలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కు ఒక ప్రణాళికతో మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
ఎక్కడైనా అనుమానాస్పద కార్య కలాపాలు, సమస్యలుంటే డయల్ 112 కు గాని, డయల్ 100 కు గాని పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్, కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ , కర్నూలు పట్టణ సిఐలు ప్రసాద్, అబ్దుల్ గౌస్, ట్రాఫిక్ ఆర్ ఎస్సై హుస్సేన్ పాల్గొన్నారు.