*నియోజకవర్గంలో గల తెలుగుదేశంపార్టీ శ్రేణుల కృషి ఫలితమే 50వేల సభ్యత్వాలు*
*గతంలో ఎన్నడూ లేనివిధంగా సభ్యత్వ నమోదు చేయించిన తెదేపాశ్రేణులు*
*పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో నియోజకవర్గంలో రికార్డ్ సభ్యత్వ నమోదు ద్వారా తెదేపా బలం మరెంత పుంజుకుంది*
*నియోజకవర్గ తెదేపా శ్రేణులను ప్రత్యేకంగా అభినందించిన పరిటాల శ్రీరామ్*
*ధర్మవరం నియోజకవర్గంలో మును పెన్నడు లేనివిధంగా సభ్యత్వ నమోదులో అర లక్ష సభ్యత్వాలు నమోదు చేయించి తెదేపా శ్రేణులు ధర్మవరం నియోజకవర్గంలో సభ్యత నమోదులో రికార్డ్ సృష్టించారు. ధర్మవరం నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల ఓటమి అనంతరం నాయకత్వలేమితో తెలుగుదేశంపార్టీ శ్రేణులు అప్పటి వైసిపి ప్రభుత్వ అరాచకాలపై పోరాడలేక నిస్తేజంగా ఉన్న తరుణంలో ధర్మవరం నియోజకవర్గానికి పరిటాల శ్రీరామ్ గారిని ఇన్చార్జిగా నియమించిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ తిరిగి జవసత్వాలు అందిపుచ్చుకొని అప్పటినుంచి ఇప్పటివరకు తెదేపా శ్రేణులు వెనక్కి తిరిగి చూడకుండా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ తీసుకున్న నిర్ణయానికి పరిటాల శ్రీరామ్ గారు కట్టుబడి పనిచేసి,ఇక్కడ NDA అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండడం యాదృచ్ఛికమే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని ఎంతోమంది నాయకులు కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ ప్రాణాలను త్రుణప్రాయంగా అర్పించిన నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం. తెదేపా శ్రేణుల ఆస్తులను ధ్వంసం చేసిన, శీనా చెట్లనునరికినా,బోర్లను పూడ్చిన వెరవని శ్రేణులు ఉండడం ధర్మవరం నియోజకవర్గ ప్రత్యేకత.అటువంటి నియోజకవర్గంలో పరిటాలశ్రీరామ్ గారి నాయకత్వంలో తిరిగి తెలుగుదేశంపార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో పరిటాలశ్రీరామ్ గారు చేసిన కృషి వెలకట్టలేనిది.రాబోవు కాలంలో తెలుగుదేశం పార్టీని ధర్మవరం నియోజకవర్గంలో మరెంత బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు ముందుకు తీసుకువెళ్తారని ఆశిద్దాం*