పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు ప్రశంసనీయం ..... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ మరియు హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ యం.మహేష్ కుమార్.


పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు  ప్రశంసనీయం ..... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్   మరియు హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ యం.మహేష్ కుమార్.  

• జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 62 వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం.

• పోలీసుల సంక్షేమమే ముఖ్యం... జిల్లా ఎస్పీ.

• సమాజసేవలో, శాంతి భద్రతల పరిరక్షణలో  హోంగార్డుల  సేవలు పోలీసులతో సమానం.

• పదవి విరమణ పొందిన హోంగార్డులను సన్మానించిన జిల్లా ఎస్పీ. 

• విధులలో ,  క్రీడల పోటీలలో గెలుపొందిన  హోంగార్డు విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ... జిల్లా ఎస్పీ. 


V3 టివి తెలుగు న్యూస్ కర్నూలు: 

పోలీసుల సంక్షేమమే ముఖ్యము అని అందరూ బాగా పని చేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ  జి. బిందుమాధవ్  అన్నారు. 
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో 62 వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి  జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్   ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుండీ గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు. బెలూన్లు, కపోతాలను ఎగురవేశారు.

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ   మాట్లాడుతూ ...

పోలీసులతో సమానంగా హోంగార్డులు శాంతిభద్రతల పరిరక్షణలో  మంచి సేవలు అందిస్తున్నారన్నారు. 
ఎమైనా  సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. సమస్యలుంటే జిల్లా ఎస్పీ కి నేరుగా కలిసి విన్నవించవచ్చన్నారు.  
హోంగార్డుల సమస్యల పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం  తరపున  జిల్లా ఎస్పీ గా తన వంతుగా కృషి చేస్తామన్నారు.  
క్రమ శిక్షణతో మెలుగుతూ పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా సమిష్టి గా విధులు నిర్వహించాలన్నారు. 
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. 
హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ యం.మహేష్ కుమార్  మాట్లాడుతూ...
హోంగార్డు వ్యవస్థ పోలీసుశాఖలో కీలకంగా మారిందన్నారు.
 పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలలో కూడా  హోంగార్డులు మంచి విధులు నిర్వహిస్తున్నారన్నారు. 
విధుల లో సహజ మరణం లేదా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే  రూ.  5 లక్షలు  జీవిత భీమా వచ్చే విధంగా  ప్రభుత్వం వెసలు బాటు కల్పించిందన్నారు. 
అనంతరం  పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ,  బి.టెక్ లలో మంచి మార్కులు సాధించిన 6 మంది హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్ షిప్స్  అందజేశారు. 
 లాంగ్ జంప్, షాట్ పుట్, 100 మీటర్స్ క్రీడల పోటీలలో  గెలుపొందిన హోంగార్డ్సు విజేతలకు జిల్లా ఎస్పీ గారు బహుమతులు  ప్రధానం చేశారు. 
వివిధ కేసులలో , బందోబస్తు విధులలో ప్రతిభ కనబరచిన 33 మంది హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. 
ఆదోని యూనిట్ కి చెందిన హోంగార్డు రాఘవులు, పత్తికొండ యూనిట్ కు చెందిన హోంగార్డు టి. క్రిష్ణ, కర్నూలు యూనిట్ కు చెందిన హోంగార్డు విజయ కుమారిలు పదవీ విరమణ పొందారు.
 జిల్లా ఎస్పీ  శాలువ, పూల మాలతో సన్మానించారు. 
విధుల్లో చైతన్యపరిచే పాటలు పాడి  హోంగార్డు ఆర్. శ్యాముల్ అందరిని అలరించారు. 
హోంగార్డు సిబ్బంది కి , కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ గారు  భోజనం వడ్డించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ యం.మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా , ఏఆర్ అడిషనల్ ఎస్పీ  కృష్ణమోహన్, కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ , ఏఆర్ డీఎస్పీ భాస్కర రావు,  హోంగార్డ్ డిఎస్పీ ప్రసాద్ ,  పోలీసు వేల్పేర్ డాక్టర్ శ్రీమతి స్రవంతి , స్పెషల్ బ్రాంచ్ సిఐ కేశవరెడ్డి,   ఆర్ ఐ లు జావేద్, నారాయణ , సోమశేఖర్ నాయక్, ఆర్ ఎస్సైలు , పోలీస్, హోంగార్డ్స్  సిబ్బంది పాల్గొన్నారు.