నమో అదాని - కరెంటు కహాని పుస్తకావిష్కరణ.
V3 టివి తెలుగు న్యూస్ కర్నూలు :
కర్నూలు : కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్ ఆదివారం ప్రజాశక్తి బుక్ హౌస్ ఆధ్వర్యంలో ప్రజాశక్తి జనరల్ మేనేజర్ నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సాహితీ స్రవంతి రాష్ట్ర సహాయ కార్యదర్శి జంధ్యాల రఘు బాబు, ఐలు రాష్ట్ర నాయకులు వెంకటస్వామి వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని నమో అదాని - కరెంటు కహాని అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ మాట్లాడుతూ దేశంలో బడా పారిశ్రామికవేత్త అయిన గౌతమ్ అదాని ప్రభుత్వ సంపదను కొల్లగొట్టడం కోసం ప్రభుత్వంలో ఉన్న వారికి ముడుపుల అప్పజెప్పి వేలకోట్ల కాంట్రాక్టులు తీసుకుంటున్నారని అన్నారు. అందులో బాగానే సోలార్ విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వాలకు 2029 కోట్ల ముడుపులు చెల్లించరని దీనిపై అమెరికాలో అదానిపై కేసు నమోదయిందని అన్నారు. మన రాష్ట్రంలో ఆదా నీ సోలార్ విద్యుత్ ను అత్యధిక రేటుకు కొనుగోలు చేయడం కోసం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ముడుపులుగా చెల్లించారన్న ఆరోపణలు నమోదయని అన్నారు. దీనివల్ల లక్షల కోట్ల విద్యుత్ భారాలు ప్రజలపై ముప్పే అవకాశం ఉందని తెలిపారు. వీటి మీద టిడిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణ జరిపించి కాంట్రాక్టులను రద్దు చేయాల్సింది పోయి మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. దీనికి ప్రధాన కారణం అదాని వెనకాల ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉండడమేనని అన్నారు. అదాని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విద్యుత్ కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి ) పాత్ర కీలకమని దీనిపై పార్లమెంట్లో చర్చ కోసం ప్రతిపక్షాలు పట్టుబడుతున్న మోడీ చెల్లించడం లేదని అన్నారు. ప్రభుత్వ సంపదను కార్పొరేట్ సంస్థలు ఎలా కొల్లగొడుతున్నాయో అదాని చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుందని అన్నారు. పది రూపాయల విలువ చేసే ఈ బుక్లెట్ చదివి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, వ్య.కా.స ప్రధాన కార్యదర్శి కె.వి.నారాయణ,మెడికల్ రెప్ యూనియన్ నాయకులు ప్రసాద్ శర్మ, ప్రజాశక్తి డెస్క్ ఇంచార్జ్ పానుగంటి చంద్రయ్య, జన విజ్ఞాన వేదిక నాయకులు బడే సాహెబ్, సుధీర్ కుమార్, నాయకులు ధనుంజయ,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి గురు శేఖర్, రచయితలు ప్రమోద్ చక్రవర్తి, మహేష్, మధు, ఎల్లా గౌడ్,వినయ్, మునిస్వామి, యూసఫ్ ఖాన్, ప్రమోద్, హుస్సేన్ భాష,మంగయ్య,జగదీష్ గౌడ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.