జిల్లా కారాగారము భద్రత ను పరిశీలించిన .... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్



జిల్లా కారాగారము భద్రత ను పరిశీలించిన .... కర్నూలు జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్

• జిల్లా కారాగారము భద్రత  పై జైలు అధికారులకు పలు సూచనలు చేసిన ..జిల్లా ఎస్పీ.

• జైలు జీవితాన్ని ఖైదీలు ఒక గుణపాఠంలా తీసుకొవాలి.

• పరివర్తనతో మంచి భవిష్యత్తు వైపు కొనసాగాలి.

V3 టివి తెలుగు న్యూస్ కర్నూలు:


జిల్లా కారాగారము యొక్క భద్రత దృష్ట్యా కర్నూలు , పంచలింగాల దగ్గర ఉన్న జిల్లా కారాగారము ను  కర్నూలు జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్  మంగళవారం సందర్శించారు. 
సెక్యూరిటి రివ్యూ కమిటి సంధర్బంగా అంతర్గత భద్రత పై జైలు అధికారులకు  పలు సూచనలు చేశారు.
జిల్లా కారాగారము పరిసరాలను, ఖైదీల గదులు, ఖైదీల కొరకు వచ్చే సందర్శకుల గది ని , ఖైదీల కు ఇచ్చే ఆహార పదార్ధాల నాణ్యాత ను జిల్లా ఎస్పీ  పరిశీలించారు.   
ఖైదీలతో మాట్లాడి వారి యొక్క బాగోగుల గురించి  అడిగి తెలుసుకున్నారు.
ఖైదీలు జైలు జీవితాన్ని గుణపాఠంలా తీసుకుని జైలు నుండి విడుదల అయిన తర్వాత మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని తెలిపారు. 
ఖైదీల పట్ల అప్రమత్తంగా ఉండాలని,  భధ్రత లోపాలు లేకుండా చూసుకోవాలని అంతర్గత భధ్రత పై జైలు సెక్యూరిటి  కమిటి వారితో మాట్లాడారు. 
భద్రత పరంగా ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టి తీసుకురావాలని, ఖైదీలలో పరివర్తన కోసం తీసుకోవలసిన చర్యల గురించి తెలియజేశారు. 
తదనంతరం  జైలు పరిసరాలు పరిశుభ్రంగా , ఆహ్లదకరంగా ఉన్నాయని జిల్లా ఎస్పీ గారు  సంతృప్తి వ్యక్తం చేసి  జైలు  విజిటింగ్ బుక్ లో సంతకం చేశారు.  
ఈ  భధ్రత రివ్యూ కమిటి  సమాశంలో జిల్లా కారాగారము పర్యవేక్షణాధికారి చంద్రశేఖర్  , జిల్లా సబ్ జైళ్ళ అధికారి డి. నరసింహా రెడ్డి ,  డిప్యూటి జైలర్ లు అనిల్ కుమార్ రెడ్డి, నాగరాజు,  మెడికల్ ఆఫీసర్ డా. జగధీష్, డిసిఆర్ బి   సిఐ గుణశేఖర్ బాబు , సిబ్బంది పాల్గొన్నారు.