ఇకపై గ్రామాల్లోనూ ‘అన్న క్యాంటీన్లు’!

ఇకపై గ్రామాల్లోనూ ‘అన్న క్యాంటీన్లు’!


AP: ఇప్పటివరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 63 చోట్ల వీటిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. జనసాంద్రత ఎక్కువగా, 40 అడుగుల రోడ్డు సదుపాయం ఉండే ప్రాంతాలను అన్వేషించాలని కలెక్టర్లను ఆదేశించింది. కాగా ఇప్పటివరకు 199 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.