రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి..ఎం.పి బస్తిపాటి నాగరాజు

...రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి..ఎం.పి బస్తిపాటి నాగరాజు

రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు... కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎం.పి, రెవెన్యూ సదస్సులలో వచ్చే భూ సమస్యలను త్వరగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కారాలకు చక్కటి వేదికగా నిలుస్తున్నాయని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కర్నూలు రూరల్ ఇంచార్జి ఎం.ఆర్.ఓ వెంకటలక్ష్మి, గ్రామ టీడీపీ నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.