*డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తన వివాహానికి ఆహ్వానించిన పీవీ సింధు*

*డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తన వివాహానికి ఆహ్వానించిన పీవీ సింధు*

అమరావతి: డిసెంబర్ 15
ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. పెద్దలు కుదిర్చిన సంబంధంతో వివాహ బంధంలోకి భారత బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు అడుగుపెట్టబోతోంది. ఈ నెల 22న రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌ వేదికగా పీవీ సింధు వివాహం జరగనుంది. 

ఈ క్రమంలో పలువురు ప్రముఖులను తన వివా హానికి హాజరు కావాలని సింధు ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను తన వివాహానికి హాజరు కావాలని పీవీ సింధు ఆహ్వానించారు. 

*మంగళగిరిలోని పవన్ కార్యాలయానికి వెళ్లి పెళ్లి శుభలేఖను అందజేశారు.*

శనివారం మధ్యాహ్నం పీవీ సింధు కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్‌మెంట్ వేడుక నిర్వహించబడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సింధు, వెంకట దత్తసాయి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. 

పీవీ సింధు వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నా యి. ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, భారత్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ హాజరు కానున్నట్లు సమాచారం.