జాతీయస్ధాయిలో హెడ్ కానిస్టేబుల్ కుమారుడి ప్రతిభ....
జాతీయ స్ధాయి స్కూల్ గేమ్స్ కరాటే పోటీలలో ఆంధ్రప్రదేశ్ కి మొదటిసారి స్వర్ణం......
V3 టివి తెలుగు న్యూస్ కర్నూలు:
జాతీయ స్ధాయిలో ఢీల్లీ లో జరిగిన కరాటే అండర్-17 (66 కిలోల విభా గం) పోటీలలో కర్నూలు సిసియస్ విభాగంలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వాసు కుమారుడు మన్నెపు వెంకట దినేష్ స్వర్ణం సాధించాడు.
ఈ గేమ్స్ లలో కర్నూలు జిల్లాకు చెందిన కె. హవీష్, పి. హేమంత్ కుమార్ రెడ్డి, సాయి అక్షిత, రుషికేశ్, యస్మిత లు వెండి, కాంస్యం పతకాలు సాధించారు.
ఈ సంధర్బంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ క్రీడాకారులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కర్నూలు జిల్లా కు మంచి పేరు , ప్రఖ్యాతులు సాధించిన క్రీడాకారులను పోలీసు అధికారులు , సిబ్బంది అందరూ అభినందించారు.
అంతర్జాతీయ స్ధాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
జాతీయ స్ధాయి స్కూల్ గేమ్స్ ఢీల్లీలో డిసెంబర్ 9 న ప్రారంభమై డిసెంబర్ 15 న ముగిశాయి.
ఈ జాతీయ స్థాయి గేమ్స్ లలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయి.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, కర్నూలు మూడవ పట్టణ సిఐ శేషయ్య , ఆర్ ఐ నారాయణ, కోచ్ జగదీష్, క్రీడాకారులు పాల్గొన్నారు.