సమిష్టి కృషితోనే నగరాభివృద్ధి సాధ్యం. .....స్థాయీ సంఘ సమావేశంలో మేయర్ బి.వై. రామయ్య

సమిష్టి కృషితోనే నగరాభివృద్ధి సాధ్యం

• స్థాయీ సంఘ సమావేశంలో మేయర్ బి.వై. రామయ్య  
• 6 తీర్మానాలు ఆమోదం, 2 తీర్మానాలు వాయిదా  
• 4 వార్డుల్లో మురుగు కాలువల నిర్మాణానికి రూ.1.47 కోట్లు కేటాయింపు 

V3 టివి తెలుగు న్యూస్ కర్నూలు:

నగరాభివృద్ధికి పాలకులు, అధికారులు సమిష్టిగా కృషి చేస్తేనే సాధ్యం అవుతుందని నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. శనివారం నగరపాలక కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. మొత్తం 8 తీర్మానాలను ప్రవేశ పెట్టారు. అందులో 6 తీర్మానాలు ఆమోదం పొందగా, మరో రెండు తీర్మానాలు వాయిదా పడ్డాయి. 23, 24, 12, 2వ వార్డుల్లో మురుగు కాలువల నిర్మాణానికి రూ. 1.47 కోట్లను కేటాయించారు. పలు ప్రాంతాల్లోని 3 పార్కింగ్ ప్రదేశాలను బహిరంగ వేలంపాట ద్వారా 3 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా కొండారెడ్డి బురుజు సమీపంలోని పూల మార్కెట్, అలాగే నగరపాలక ఆదాయం పెంపునలో భాగం 12 ఏళ్ళ క్రితం పెట్టిన రుసుమును సవరిస్తూ, మరికొన్ని దుకాణాలను కలిపి, 346 రకాలుగా దుకాణాలను విభజించి, వాటి రుసుము పెంపునకు సంబంధించిన తీర్మానాలను పునః సమీక్షించాలని సభ్యులు నిర్ణయించారు. దీంతో ఆ రెండు తీర్మానాలు వాయిదా వేశారు. సమావేశంలో కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, సభ్యులు ఎం.విక్రసింహా రెడ్డి, మిద్దె చిట్టమ్మ, యూనూస్, క్రాంతి కుమార్, జుబేర్, అదనపు కమిషనర్ అర్జీవి క్రిష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఎంహెచ్ఓ విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, సిపి ప్రదీప్ కుమార్, ఆర్ఓలు జునైద్, ఇశ్రాయోలు, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, ఎంఈ సత్యనారాయణ, ఎగ్జామినర్ సుబ్రమణ్యం, గుమాస్తా జి.ఎం. శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ఆమోదించిన తీర్మానాలు..

1. 23వ వార్డు శ్రీరామ్ నగర్ నందు వివిధ వీధుల్లో సిసి మురుగు కాలువ నిర్మాణానికి రూ.49.90 లక్షలు కేటాయింపు.
2. 24వ వార్డు లక్ష్మి నగర్ నందు అల్తాఫ్ కాంప్లెక్స్ నుండి అబ్దుల్ రజాక్ మసీద్ వెనుక ఉన్న ప్రధాన కాలువ వరకు సిసి మురుగు కాలువ నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు.
3. 12వ వార్డు ఆర్‌కేటి వీధి దగ్గర డబర ప్రాంతంలో సిసి మురుగు కాలువ నిర్మాణానికి రూ.32.40 లక్షలు కేటాయింపు.
6. శ్రీనివాస క్లాత్ మార్కెట్, వినాయక ఘాట్, కిడ్స్ వరల్డ్ ప్రాంతాల్లో ఉన్న పార్కింగ్ ప్రదేశాలను బహిరంగ వేలంపాట ద్వారా లీజుకు కేటాయించేందుకు ఆమోదించారు.
7. 2వ వార్డు గడియారం ఆసుపత్రిలోనికి మురుగునీరు వెళ్లకుండా, అక్కడి నుండి అల్లిషేర్ భాగ్ డ్రైనేజీ సమస్య పరిష్కరించేందుకు, హజీర కాలేజీ నుండి జామి మసీద్ వరకు నూతన మురుగుకల్వ నిర్మాణానికి రూ.35.00 లక్షలు కేటాయించారు.

వాయిదా వేసిన తీర్మానాలు..

1. తేదీ: 18-01-2012 నాటి నుండి అమలు చేస్తున్న వ్యాపార దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ రుసుములను పెంచి, మరిన్ని వ్యాపార దుకాణాలను జత చేసి, మొత్తం 346 రకాల దుకాణాల ట్రేడ్ లైసెన్స్ రుసుములను పెంపునకు సంబంధించిన తీర్మానం వాయిlదా పడింది.
2. కొండారెడ్డి బురుజు వద్దనున్న పూల మార్కెట్ 4 సంవత్సరాల పాటు లీజు ఇచ్చేందుకు బహిరంగ వేలంపాట నిర్వహించుటకు పునః సమీక్షించాలని వాయిదా‌ వేశారు.