హెల్మెట్ ధరించడం పై అవగాహన ర్యాలీ నిర్వహించిన ..... జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ .
• ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.
• హెల్మెట్ ధరించడం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం.
V3 టివి తెలుగు న్యూస్. కర్నూలు:
శుక్రవారం హెల్మెట్ ధరించడం పై కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ లో పాల్గొన్నారు.
ఈ అవగాహన ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రారంభమై కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్,కలెక్టరేట్ మీదుగా సి. క్యాంపు సెంటర్ వరకు కొనసాగింది.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ....
హెల్మెట్ ధరించడం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే కర్నూలు ట్రాఫిక్ పోలీసులతో అవగాహన ర్యాలీ చేపట్టామన్నారు.
జాతీయ , రాష్ట్ర రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్రవాహనదారులే మరణిస్తున్నారన్నారు.
బైక్ లు నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.
వాహనచోదకులు హెల్మెట్ ధరించి వాహానాలు నడపడం వల్ల అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సురక్షితంగా గమ్యాలను చేరుకోవాలన్నారు.
యువత అత్యుత్సాహం తో అతివేగంగా వాహనాలను డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదన్నారు.
తల్లితండ్రులు తమ పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియజేయాలన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండేలా, మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకుండా, పరిమితికి మించి వెళ్ళకుండా పలు జాగ్రత్తలు చేపడితే దాదాపు రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు.
ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజారావు, శేషయ్య, చంద్రబాబునాయుడు, ఎస్సైలు, ఆర్ ఎస్సై లు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.