కర్నూల్ నగరపాలక ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం...నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

• నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు 
• ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 17 అర్జీలు 

ప్రతి సోమవారం నగరపాలకలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే ఫిర్యాదులను జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17 అర్జీలు వచ్చాయి. వాటన్నింటిని నిశితంగా పరిశీలించిన కమిషనర్, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఎస్ఈ రాజశేఖర్, ప్రజారోగ్యధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, ఆర్ఓ జునైద్, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, టిడ్కో అధికారి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

1. రాజీవ్ గృహా కల్ప 3వ బ్లాకు నందు కొత్త బోరు వేయించాలని కాలనీ వాసులు కె.లక్ష్మిరెడ్డి, వెంకటరాముడు, సంజీవ రెడ్డి తదితరులు కోరారు.
2. ఎఫ్.సి.ఐ. కాలనీ -1 నందు రహదారులు, మురుగునీరు కాలువలు నిర్మించాలని స్థానికులు ప్రకాశ్, విజయభాస్కర్, భూపాల్ రెడ్డి తదితరులు విన్నవించారు.
3. బాలాజీ నగర్ క్రీ సెంట్ హైట్స్ అపార్ట్మెంట్ నందు పూడికతీత పనులు చేపట్టాలని నివాసులు రిటైర్డ్ తాసిల్దార్ లక్ష్మణ స్వామి, ఎం.ఎన్. హుస్సేన్, చంద్రశేఖర్, యూనూస్ తదితరులు కోరారు.
4. అశోక్ నగర్, భగత్ సింగ్ వైపు నుండి వచ్చే మురుగునీరును కేసి కెనాల్‌లోకి వెళ్ళకుండా 8 నెలల క్రితం నిలపేసినందున, దానికి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం చూపాలని టిడిపి బూత్ ఇంచార్జి పుసులూరు ప్రభాకర్, బసన్న తదితరులు విన్నవించారు.