జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలి: NUJ (I). తీర్మానం.
విజయవాడలో ఘనంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు.
విజయవాడ,డిసెంబర్ 11: నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (NUJ) జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారం విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో గల విజయవాడ క్లబ్ లో ఘనంగా జరిగాయి. nuj జాతీయ అధ్యక్షులు రాస్ బిహారీ అద్యక్షతన జరిగిన సమావేశంలో 20 రాష్ట్రాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనుబంధ జర్నలిస్టు సంస్థ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రధాన బాధ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించాయి. అక్రిడిటే షన్లు,ఇండ్ల స్థలాలు, ఆరోగ్య భీమా తదితర అంశాలపై చర్చించి, తీర్మానాన్ని ఆమోదించారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టు లపై దాడులు,అక్రమ కేసులపై సమావేశంలో చర్చించి, ప్రభుత్వం జర్నలిస్టు లకు రక్షణ కల్పించాలని కోరారు. సమావేశంలో జాతీయ కార్యదర్శి ప్రదీప్ తివారీ, కోశాధికారి అరవింద్ సింగ్, ఉపాధ్యక్షులు శివకుమార్, రాష్ట్ర జాప్ అధ్యక్షుడు పున్నం రాజు, ట్రస్ట్ ఛైర్మన్ సుభాష్ బాబు,కార్యదర్శి యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తుగ్గలి శ్రీనివాస్ గౌడ్, నంద్యాల జిల్లా కన్వీనర్ దేవేందర్ రెడ్డి, జాప్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిపి జమాల్ బాషా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా నాయకులు ఎన్. యు . జే జాతీయ అధ్యక్షుడు రాస్ బిహారీ తో పాటు జాప్ రాష్ట్ర అధ్యక్షుడు పున్నమరాజును ఘనంగా సన్మానించారు.