కాల్వ గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

కాల్వ గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి


V3 టీవీ తెలుగు న్యూస్ :
పాణ్యo నియోజకవర్గo:-
 ఓర్వకల్లు మండలంలోని కాల్వ గ్రామంలో సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమం మరియు గ్రామo లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి,టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షుడు, టిటిడి బోర్డు మెంబర్ *మల్లెల రాజశేఖర్* గారు,మండల అధికారులు కలిసి ప్రజల వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో అధికారంలోకి రావడానికి దొంగ పట్టాలు మంజూరు చేశారని వాటన్నింటినీ రద్దు చేయాలని అదేవిధంగా భూకబ్జాలు  విపరీతంగా చేశారని వీటన్నిటిపై విచారణ జరిపి నిజమైన రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబధిత గ్రామ పంచాయితీ  అధికారులు,గ్రామ టిడిపి నాయకులు,మండల అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.