నేషనల్ కాంపిటీషన్ లో పెరవలి విద్యార్థిని విజేత

కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో సన్రైస్కూల్ నుండి ఫిబ్రవరి 9న ఆదివారం విజయవాడలో మన కళ్యాణ వేదికలో అబాకస్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో సీనియర్ లెవెల్ "3" లో E. పల్లవి ఆరవ తరగతి విజేతగా నిలిచి జాతీయస్థాయి(నేషనల్ కాంపిటీషన్) కి ఎన్నిక కావడం జరిగింది. మార్చ్ 3 వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో పాల్గొనడం జరుగుతుంది .అదేవిధంగా పి. హరి ప్రణతి రైసింగ్ స్టార్ ప్రైజ్ ను గెలుచుకోవడం జరిగింది. వీరు ఈ స్థాయికి రావడానికి కృషిచేసిన ట్రైనీ టీచర్లను స్కూల్ కరస్పాండెంట్ రవి శేఖర్ అభినందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మార్చి మూడవ తేదీన జరగబోయే నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి ఇంటర్నేషనల్ లెవల్ కు ఎంపిక అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.