రాప్తాడు ఎమ్మెల్యే .శ్రీ పరిటాల సునీత కలిసిన అనంతపురం జిల్లా వాల్మీకి బోయ సంఘం నేతలు


రాప్తాడు ఎమ్మెల్యే గౌ.శ్రీ పరిటాల సునీత  కలిసిన అనంతపురం జిల్లా వాల్మీకి బోయ సంఘం నేతలు

నేడు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ.శ్రీ పరిటాల సునీత  కలసి జిల్లాలో మరియు రాష్ట్రంలో వాల్మీకులు ఎదుర్కొంటున్న సమస్యల గూర్చి తెలియపరచి అదే విధంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం మీద అసెంబ్లీలో తమ గళం వినిపించాల్సిందిగా  ఎమ్మెల్యే ని కోరడం జరిగింది, తనని కలవడానికి విచ్చేసిన మన APVBS నాయకులని పరిటాల సునీత  ఎంతో ఆప్యాయంగా పలకరించి మన సమస్యలు వినడానికి చాలా సమయం కేటాయించి ఎంతో ఓపికగా వినడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ పై అసెంబ్లీలో తమ గళం వినిపిస్తామని అంతేకాకుండా దశాబ్దాల తరబడి ఉన్న ఈ సమస్య గూర్చి మరొక్కసారి గౌరవ సీఎం  దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మాధవయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణి రవి , యూత్ వింగ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ , నగర మహిళా అధ్యక్షురాలు మంజుల, ప్రొఫెషనల్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, టౌన్ ప్రధాన కార్యదర్శి ముత్యాలు, రాప్తాడు సాకే నారాయణస్వామి, జూటూరు రామకృష్ణ , చెడిపోతుల గంగాధర్, రాప్తాడు యూత్ వింగ్ ప్రెసిడెంట్ మోహన్, చెడిపోతుల లక్ష్మినారాయణ, వార్తా అర్బన్ రిపోర్టర్ రాజ్ కుమార్, నాయకులు చెడిపోతుల కేశవ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.