ఏటీఎం దొంగతనంకు పాల్పడిన 4 గురు నిందితులు అరెస్ట్......ఉత్తరాది రాష్ట్రాల్లో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా.



• ఏటీఎం దొంగతనంకు పాల్పడిన 4 గురు నిందితులు అరెస్ట్...

• ఉత్తరాది రాష్ట్రాల్లో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా.
• ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఏటీఎం దొంగతనానికి ప్రయత్నం చేసిన  నిందితులు. 

• ప్రధాన ముద్దాయిలైన  షాహిద్ ఖాన్ పై 26 కేసులు ,  ఇమ్రాన్ ఖాన్ పై 15 కేసులు  ఏటీఎం దొంగతనాల కేసులు నమోదు.  

• వీరికి బెయిల్ రాక ముందే కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటాం.

• ఈ కేసును చేధించిన పోలీసు అధికారులను , సిబ్బందిని అభినందించి, రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ. 

అరెస్టు అయిన ముద్దాయిల వివరాలు...

1) షాహీద్ ఖాన్, 38 సంవత్సరాలు, S/o సుజావుద్దీన్ రాయపురి, గ్రామం, నుహ్ తాలుకా, మేవాత్ జిల్లా, హర్యానా రాష్ట్రం.
2) S. ఇమ్రాన్ ఖాన్, 35 సంవత్సరాలు, S/o లేట్ సంషుద్దీన్, మమ్ముల్కా గ్రామం, హాతీ PS, పాల్వాల్ జిల్లా, హరియాణా రాష్ట్రం.

3 ) జంసాద్ ఖాన్, 43 సంవత్సరాలు, S/o రషీద్ రాయపురి గ్రామం, మేవాట్ జిల్లా, హరియాణా రాష్ట్రం.

4)  షావ్కర్ ఖాన్ S/o జంసద్ ఖాన్ రాయపురి గ్రామం, మేవాట్ జిల్లా, హరియాణా రాష్ట్రం.

అరెస్టు అయిన నిందితుల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో  జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  వెల్లడించారు. 
24.02.2025 వ తేదీన రాత్రి 1.00 గంటల సమయములో చిన్నటేకూర్ గ్రామములొ N.H.44 సర్వీస్ రోడ్డు ప్రక్కన ఉన్న BANK OF BARODA ATM సెంటర్ పై దొంగలు షటర్ ను ఒక టోయింగ్ వాహనముతో బలవంతముగా లాగి, లోపల ఉన్న ATM మిషన్ కు తాళ్ళు కట్టి బయటకు లాక్కొని పోవడానికి ప్రయత్నిస్తుండగా గ్రామ యువకులు గమనించి పోలీసు వారికి సమాచారము అందించినారు.
పోలీసు వారి సూచనల మేరకు యువకులు దొంగలను గమనిస్తూ ఉండడంతో వారు ATM మిషన్ రోడ్డు ప్రక్కన వదలి టోయింగ్ వాహనముతో అక్కడ నుండి పారిపోయినారు. 
కర్నూల్ టౌన్ DSP, రూరల్ CI, ఉల్లిందకొండ మరియు ఓర్వకల్ SIలు  ATM ను సందర్శించి, దొంగలు ప్రయాణించిన టోయింగ్ వాహనమును ఉల్లిందకొండ క్రాస్ రోడ్డు తర్వాత NH.44 రోడ్డు పైన కనుగొనడం జరిగింది.
  BANK OF BARODA BANK మేనేజర్ ఫిర్యాదు పైన ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ నందు Cr.No.23/2025 U/s 309 (5), 312 r/w 62 BNS దోపిడి సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. 
కేసు దర్యాప్తు చేపట్టి శాస్రీయ ఉపకరణాల ద్వారా టోయింగ్ వాహనమును దొంగలు దొంగిలించినప్పుడు మరియు ATM ల దగ్గర CCTV పుటేజీలను ఇంకా నేరస్తుల యొక్క కదలికలను గుర్తించడం జరిగింది.
టోయింగ్ వాహనము పైన లభించిన ఆధారాలను కూడా పరిశీలించడం జరిగింది. వాటి ద్వారా నేరస్తులు కర్నూల్ నందు ఒక కంటైనర్ వాహనము ద్వారా ప్రయాణించి తిరిగి బెంగుళూరు వైపుగా ప్రయాణిస్తున్నట్లు నిర్ధారించుకొని ఆ వాహనము యొక్క కదలికలు, దాని యొక్క వివరములు శాస్త్రీయ పద్దతుల ద్వారా కనుక్కోవడం జరిగింది. 
ఆ వాహనము కంపెనీ యజమాన్యం  ద్వారా దాని అయిన జంషడ్ ఖాన్ డ్రైవర్ యొక్క వివరాలను సేకరించి, అతను వాడిన ఫోన్ నెంబర్ల ద్వారా అతనితో పాటు ఉన్న ఇతర ముగ్గురు వ్యక్తుల యొక్క వివరాలను సేకరించడం జరిగింది. 
డ్రైవరుగా ఉన్న వ్యక్తి షావు ఖార్ ఖాన్ తండ్రి పేరు జంషెద్ ఖాన్, షాహిద్ ఖాన్వీరందరిది హర్యానా రాష్ట్రం లోని నూహ్ మేవత్ జిల్లా లోని రాయిపురి గ్రామానికి చెందినవారుగా మరియు సున్నీ ఇమ్రాన్ ఖాన్ ది మమ్ములక గ్రామము, పాల్వాల్ జిల్లా, హరియాణ రాష్ట్రం అని గుర్తించడమైనది.
టోయింగ్ వాహనము పైన లభించిన ఆధారాల ద్వారా షాహిద్ ఖాన్ ముఖ్య నేరస్థుడిగా నిర్ధారించుకోవడం జరిగింది. 
కర్నూల్ IV టౌన్  PS నందు టోయింగ్ వాహనము దొంగిలించిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.
ముద్దాయిల కోసం కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  ఆదేశాల మేరకు  కర్నూలు డిఎస్పీ  ఆధ్వర్యంలో, కర్నూల్ రూరల్ CI, కర్నూల్ మూడవ పట్టణ CI, ఉల్లిందకొండ SI, ఓర్వకల్ SI లను నాలుగు బృందాలుగా నియమించి గాలింపు చర్యలను చేపట్టడం జరిగింది. 
తదుపరి రాబడిన సమాచారం మేరకు రూరల్ CI చంద్రబాబు నాయుడు వారి సిబ్బందితో కలిసి పై తెలిపిన ముద్దాయిలను ఉదయం 6.30 గంటలకు పై కేసులలో చెట్లమల్లాపురం గ్రామము సమీపం లోని NH-44 ప్రక్కన గల SAMRATHAL RAJASTHAN DHABA దగ్గర అరెస్ట్ చేయడమైనది.
వారి వద్ద నుండి ఒక గ్యాస్ కట్టర్, చిన్న గ్యాస్ సిలిండర్, రెండు కత్తులు, తాళాలు తెరవడానికి ఉపయోగించిన దొంగ తాళాలు, మాస్క్ లు,గ్లౌజ్ లు, రెండు స్ప్రే టిన్నులు, కూలింగ్ అద్దాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 
వారిని విచారించగా, వారు చిన్నటేకూరు BANK OF BARODA ATM దోపిడి కేసును, నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని AXIS BANK ATM లో 23.02.2025 తేదీ తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించగా ఆలారమ్ మొగడంతో పారిపోయినట్లు మరియు దోపిడి చేయడం కోసం టోయింగ్ వాహనమునుదొంగలించినామని ఒప్పుకున్నారు. 
తదుపరి విచారణలో వారు హరియాణ, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,రాష్ట్రాలలో నేరాలు చేసినట్లుగా అంగీకరించినారు. షాహిద్ ఖాన్ 26 ATM దొంగతనాలు, ఇమ్రాన్ ఖాన్ 15 ATM దొంగతనాలు చేసినట్లు అంగీకరించినరు.  మిగిలిన ఇద్దరు నేరస్థుల గురించి విచారణ జరుగుతుంది. అరెస్ట్ సమాచారం అన్నీ రాష్ట్రాలకు పంపించినాము. అలాగే ముద్దాయిలను కోర్టు ముందు హాజరు పెట్టినాము. 
జిల్లాలో సంచలనం రేకెత్తించిన ATM మిషన్ల దోపిడి కేసులను సత్వరం ఛేదించిన కర్నూల్ సబ్ డివిజన్  ఎస్.పి, జె. బాబు ప్రసాద్ ని మరియు వారి సిబ్బందిని జిల్లా SP  విక్రాంత్ పాటిల్  అభినందించినారు. 
అలాగే దర్యాప్తులో పాల్గొన్న కర్నూల్ రూరల్ CI చంద్రబాబు నాయుడు, కర్నూల్ మూడవ పట్టణ CI శేషయ్య,దేవనకొండ CI వంశీధర్,సైబర్ CI వేణుగోపాల్,వారి సిబ్బంది, ఉల్లిందకొండ SI ధనుంజయ, ఓర్వకల్ SI సునిల్ మరియు వారి సిబ్బంది అందరికీ జిల్లాఎస్పీ  నగదు రివార్డులు అందజేశారు.