ప్రజలకు మంచి సేవలందించి పోలీసు గౌరవం పెంపొందించాలి.... జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ .
• పోలీసుస్టేషన్ లకు వచ్చే భాదితుల పట్ల మర్యాదపూర్వకంగా సున్నితంగా వ్యవహారించాలి.
ఇటీవల అనంతపురం జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రోబేషనరీ ఎస్సైలలలో 8 మందిని కర్నూలు జిల్లాకు కేటాయించారు.
శిక్షణ పూర్తి పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ ఎస్సైలు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు
ప్రొబేషనరీ ఎస్సైలకు అభినందనలు తెలిపారు.
విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా సేవలు అందించి పోలీస్ శాఖ పేరుప్రతిష్టలను ఇనుమడింప చేయాలని సూచించారు.
ఇందులో 8 మంది సివిల్ ఎస్సైలలో 7 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు.
ప్రోబేషనరీ ఎస్సైలను గ్రేహౌండ్స్ మరియు బెటాలియన్, సమస్యాత్మక ప్రాంతాలలో కొన్ని నెలలపాటు విధులకు కేటాయించనున్నారు.