రహదారి భద్రత నిబంధనలు, హెల్మెట్ పై ప్రజలకు అవగాహన
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ గారు వైపర్ బి ఫార్మసి మరియు నారాయణ ఇంగ్లీషు మీడియం స్కూల్ కు చెందిన మొత్తం 50 మంది విద్యార్దులచే రహదారి భధ్రత నిబంధనలు మరియు హెల్మెట్ వినియోగం ప్రజలకు అవగాహన కల్పించారు.
ముఖ్యమైన రద్దీ ప్రాంతమైన కర్నూలు , రాజ్ విహార్ లో రహదారి భద్రత నిబంధనల పై , హెల్మెట్ వినియోగం పై కర్నూలు ట్రాఫిక్ పోలీసులు, విద్యార్దులు కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ ఎస్సై హుస్సేన్, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్దులు పాల్గొన్నారు.