కర్నూలు IV టౌన్ పోలీసు స్టేషన్ పరిధి లోని కల్లూర్ శరీన్ నగర్ పార్క్ లోని వాటర్ ట్యాంక్ దగ్గర గంజాయి అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్.



గత నెల 28-03-2025 తేదీ న రాత్రి 08-30 గంటల సమయం లో కర్నూలు IV టౌన్ పోలీసు స్టేషన్ పరిధి లోని కల్లూర్ శరీన్ నగర్ పార్క్ లోని వాటర్ ట్యాంక్ దగ్గర గంజాయి అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్.
కర్నూలు జిల్లా SP  ఉత్తర్వుల మేరకు కర్నూలు IV టౌన్ పోలీసు స్టేషన్ పరిధి లో గంజాయి అమ్మడం గాని, రవాణా చేయడం లేదా కొనడం లాంటి కార్యకలాపాలు నిరోదించడం లో భాగముగా నిన్న రాత్రి రాబడిన సమాచారం మేరకు శరీన్ నగర్ లోని పార్క్ నందు గల వాటర్ ట్యాంక్ కింద 1) చిగుర్ల చిన్న నరసింహులు @ చిన్ని తండ్రి పేరు నడిపి రంగ స్వామి, చెంచు నగర్, ఓల్డ్ కల్లూర్, కర్నూలు 2) తన పేరు P. రంగనాయకులు తండ్రి మహాదేవులు, వయస్సు 24 సం. రాలు, τ/ο Η.No. 7-119-14, 5, 5: 3) C. 25 . 2 25 20. రాలు, r/o H.No.72/34(1), ఊరు వాకిలి దగ్గర, కల్లూర్, కర్నూలు 4) షేక్ ఇస్మాయిల్ తండ్రి షేక్ 2 2. 2 27 20. 0, 1/0 H.No. 77/136-1-A-3-2-6, 2, మరియు 5) K. కృష్ణ తండ్రి నాగరాజు, వయస్సు, 23 సం. రాలు, r/o H.No. 81/15. కృష్ణా నగర్, కర్నూల్ గంజాయిని చిన్న చిన్న పొట్లాలలో పెట్టి అమ్మడానికి చేసే ప్రయత్నం లో ఉండగా కర్నూలు నాలగవ పట్టణ ఇన్స్పెక్టర్ మధు సుదన్ గౌడ్, గోపీనాథ్, సట్-ఇన్స్పెక్టర్ గారు, సిబ్బంది తో పాటు గెజెటెడ్ అధికారి శ్రీ గురు స్వామి రెడ్డి మరియు ప్రభుత్వ అధికారుల సమక్షం లో దాడి చేసి వారి నుండి 2.7 kg ల గంజాయి ని స్వాదీనపరచుకొని, వారిని రిమాండ్ చేయడమైనదని, ఇంకా ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని నాలగవ పట్టణ ఇన్స్పెక్టర్ గారు తెలిపినారు.

పొలిసు వారి హెచ్చరిక

నాలగవ పట్టణ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ ప్రజలను ముఖ్యముగా యువత ను మత్తు పదార్థాలయిన సారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరముగా ఉండాలనీ, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరినారు. ఎవరయినా మత్తు పదార్థాలు అమ్మితే చట్టపరముగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.