సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా సాగిన చర్చ వక్స్ ఆస్తుల నిర్వహణ కోసమే బిల్లును తెచ్చామన్న కేంద్రమంత్రి రిజిజు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం
చేస్తున్నయ్: అమిత్ షా మైనార్టీలను కించపరుస్తున్నరు: కాంగ్రెస్సభలో బిల్లు కాగితాలను చింపేసిన ఒవైసీనేడు రాజ్యసభ ముందుకు బిల్లుదేశవ్యాప్తంగా వక్స్ ప్రాపర్టీల నిర్వహణ కోసం తెచ్చిన వక్స్(సవరణ) బిల్లు, 2025కు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర న్యాయ, మైనార్టీ వ్యవహారాల శాఖల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు సభలో ప్రవేశపెట్టగా.. అధికార, ప్రతిపక్షాల మధ్య అర్ధరాత్రి
వరకు వాడివేడి చర్చ కొనసాగింది. ముందుగా బిల్లుపై చర్చకు స్పీకర్ 8 గంటల సమయం కేటాయించగా.. సుదీర్ఘంగా 12 గంటలపాటు మారథాన్ డిబేట్ జరిగింది.అర్ధరాత్రి ఒంటి గంటకు బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటేయడంతో బిల్లు పాసైనట్టు స్పీకర్ ప్రకటించారు.