శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఆదివారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు గట్టి భధ్రత , ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాలతో కర్నూలు జిల్లా పోలీసులు ఆయా పోలీసుస్టేషన్ ల పరిధులలోని దేవాలయాల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అదే విధంగా కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూలు ఒన్ టౌన్ సిఐ రామయ్య నాయుడు ఆధ్వర్యంలో కర్నూలు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని తెలుగు గేరి నుండి శ్రీరాముల వారి శోభయాత్ర బయలు దేరి రంగరాజ్ గేరి, మెయిన్ బజార్ మీదుగా బాదం మసీదు, పూల బజారు, చౌక్ బజార్, గడియారం హాస్పిటల్ , మించిన్ బజార్ , బొంగుల బజార్ తిరిగి తెలుగు గేరి కి చేరింది.
శ్రీరాముల వారి శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టారు.