కర్నూలు రేంజ్ పోలీసులకు క్రీడా పోటీలు.
క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులను రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేసేందుకే ఈ క్రీడా పోటీలు.
--- త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ధాయి పోలీసు క్రీడా పోటీలు జరగునున్నాయి. ఆయా రేంజ్ లనుండి క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పోలీసులను రాష్ట్రస్ధాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నారు.
కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ క్రీడల పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న పోలీసు సిబ్బందికి అవకాశం కల్పించారు.
ఈ సంధర్బంగా కర్నూలు (కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాలు) రేంజ్ పోలీసులకు కర్నూలు నగరంలోని ఔట్ డోర్ స్డేడియంలో క్రీడల పోటీలు జరుగుతున్నాయి.
ఈ క్రీడల పోటీల ఎంపిక 3 రోజుల పాటు జరగనున్నాయి.
పుట్ బాల్,వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్ బాల్, షటీల్, రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్, షాట్ పుట్, క్రికెట్, బాస్కెట్ బాల్ వంటి వివిధ క్రీడలలో పోటీలు నిర్వహిస్తున్నారు.
పోలీసు సిబ్బందికి క్రీడలు మరియు వ్యాయామం చాలా అవసరం, ఇది వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని కర్నూలు ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పేర్కోన్నారు.
ఈ క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయబడతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ డిస్పీ భాస్కర్ రావు, ఆర్ ఐలు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.